జన్నారం మండలంలోని రోటిగూడా గ్రామంలో ఉన్న గీతాశ్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త పూర్ణచందర్రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గీతా జయంతిని పురస్కరించుకొని సోమవారం ఆయన రోటిగూడా గీతాశ్రమాన్ని సందర్శించారు. అనంతరం దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు ఆయనను శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.