SRCL: వేములవాడ ఇంఛార్జ్ డీఎస్పీగా కే. నాగేంద్రచారి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక్కడ ఏఎస్పీగా నియమితుడైన ఐపీఎస్ అధికారి, గ్రే హౌండ్స్ ఏఎస్పీ కొట్టే సాయి రుత్విక్ శిక్షణలో ఉన్న కారణంగా ఇంకా విధుల్లో చేరలేదు. దీంతో సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారికి వేములవాడ ఇంఛార్జ్ డీఎస్పీగా అదనపు బాధ్యతలు అప్పగించారు.