NDL: డోన్ పట్టణం కొండపేట 13వ వార్డు, దొరపల్లె గ్రామంలో ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి సోమవారం సచివాలయ సిబ్బంది, టీడీపీ నాయకులతో కలిసి పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా కూటమి ప్రభుత్వం పింఛన్ల నగదును పెంచి పంపిణీ చేస్తున్నామని అన్నారు. అర్హులైన వారందరికీ పార్టీలకు అతీతంగా సూపర్ సిక్స్ పథకాలు వర్తిస్తాయని అన్నారు.