NLR: కొడవలూరు మండలం వ్యాప్తంగా సోమవారం ఉదయం నుంచి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జోరుగా కొనసాగుతుంది. మండలంలోని గండవరం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ జోరు వానలో సైతం ఇంటింటికి తిరుగుతూ అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత ఆలం మాలకొండయ్య, అగ్రికల్చర్ అసిస్టెంట్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.