సత్యసాయి: అమడగూరు మండలం ఎస్సీ కాలనీలో ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి పర్యటించారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి పింఛన్ మొత్తాన్ని అందజేశారు. మండలంలోనీ మహమ్మదాబాద్, కస్సముద్రం, ఆమడగూరు, చినగాని పల్లి తదితర గ్రామాల్లోనూ లబ్ధిదారులను ఆప్యాయంగా పలకరించి పింఛన్ పంపిణీ చేశారు.