NTR: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోందని విస్సన్నపేట మండల టీడీపీ అధ్యక్షుడు రాయల సుబ్బారావు తెలిపారు. విస్సన్నపేటలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీని నాయకులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు నగదును అందజేసిన ఆయన, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ తమ ప్రభుత్వం పథకాలు మంజూరు చేస్తుందని హామీ ఇచ్చారు.