ఇవాళ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉదయం 10 గంటలకు ప్రధాని మోదీ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో 10 బిల్లులను సభ ముందుకు తీసుకురానున్నారు. అలాగే కాలం చెల్లిన 120 చట్టాలను రద్దు చేసే బిల్లును కూడా కేంద్రం ప్రవేశపెట్టనున్నారు.