శ్రీకాకుళం: నందిగాం మండలం కాపు తెంబూరులో సోమవారం గీతా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అభయాంజనేయ స్వామి ఆలయంలో శ్రీ మద్భగవద్గీత సామూహిక పారాయణం చేశారు. గీతాయజ్ఞంలో కొల్లి దీనబంధు, పోలాకి వాసుదేవు, పోలాకి రామారావు, కారగ్గి మోహనరావు, పోలాకి రామకృష్ణా రావు, కారగ్గి లక్ష్మీనారాయణ, పోలాకి ఫల్గుణరావు తదితరులు పాల్గొన్నారు.