గద్వాల జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మూడు విడతల్లో జరగనున్నాయి. తొలి విడతలో 4 మండలాల్లోని 106 గ్రామాలు (974 వార్డులు), రెండో విడతలో 4 మండలాల్లోని 74 గ్రామాలు (725 వార్డులు), మూడో విడతలో 5 మండలాల్లోని 75 గ్రామాలు (700 వార్డులు) ఎన్నికల బరిలో ఉన్నాయి. తొలి విడత నామినేషన్ల ప్రక్రియ ఇప్పటికే పూర్తి కాగా, రెండో విడత నామినేషన్ పక్రియ కొనసాగుతుంది.