BDK: చర్ల మండలంలోని పులిగుండాల గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో సోడి జగపతికి చెందిన పూరిల్లు షార్ట్ సర్క్యూట్తో పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో ఆ కుటుంబం నగదు, బంగారంతో సహా సర్వం కోల్పోయింది. కట్టుబట్టలతో బయటపడిన ఆ కుటుంబానికి స్థానిక రెవెన్యూ అధికారులు తక్షణ సహాయం అందించాలని మాజీ సర్పంచ్ చలపతి కోరారు.