NZB: జిల్లాలో రెండో విడతలో జరగనున్న 8 మండలాల్లో తొలి రోజైన ఆదివారం 196 సర్పంచి స్థానాలకు 122, 1760 వార్డు స్థానాలకు 148 నామినేషన్లు దాఖలు అయ్యాయని అధికారులు తెలిపారు. రెండో విడతలో ధర్పల్లి, డిచ్పల్లి, ఇందల్వాయి, మాక్లూర్, మోపాల్, నిజామాబాద్, సిరికొండ మండలాలతో పాటు ఆర్మూర్ డివిజన్లోని జక్రాన్ పల్లి మండలాల పరిధిలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.