మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ ఎంపీ సురేష్ బాలు(Suresh Balu) ధనోర్కర్ కన్నుమూశారు. కాంగ్రెస్ నాయకుడు సురేష్ బాలు ధనోర్కర్ ఢిల్లీ ఎన్సీఆర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. అతని వయసు 47 సంవత్సరాలు. సురేష్ బాలు మహారాష్ట్రలోని చంద్రపూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ కు చెందిన ఏకైక ఎంపీ. సురేష్ బాలు ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచినట్లు మహారాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి అతుల్ లోంధే చెప్పారు.