NDL: సిరివెళ్ల మండలం పూలతోట కొట్టాల గ్రామంలో జరుగుతున్న ల్యాండ్ సర్వే పనులను శుక్రవారం తహశీల్దార్ విజయశ్రీ పరిశీలించారు. సర్వేను పరిశీలించిన ఆమె సిబ్బందికి సూచనలు సలహాలు చేశారు. మండల సర్వే చిన్న మల్లయ్య అధ్యక్షతన జరుగుతున్న సర్వే పనులను ఎలాంటి అవకతవకలు లేకుండా పగడ్బందీగా నిర్వహించాలని సూచించారు. సర్వే పనులు ఆలస్యం కాకుండా పూర్తి చేయాలన్నారు.