రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఫస్ట్ డే రూ.7.65కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఓవర్సీస్లో ఈ చిత్రం 275K డాలర్లకుపైగా వసూళ్లు సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు. రేపు, ఎల్లుండి వీకెండ్ కావడంతో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.