KDP: కాశినాయన మండలం గంగనపల్లి గ్రామ సమీపంలో లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రైతులకు సాగునీరు అందించేందుకు బద్వేల్ మార్కెట్ యార్డ్ వైస్ ఛైర్మన్ బసిరెడ్డి రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో గురువారం 100 KV విద్యుత్ ట్రాన్స్ ఫారం ఏర్పాటు చేశారు. పూజలు నిర్వహించి నీటిని విడుదల చేశారు. రైతుల అభివృద్ధికి సాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రవీంద్రారెడ్డి తెలిపారు.