»Madhya Pradesh 6 Saptarishi Statues Collapse At Ujjain Mahakal Lok Corridor
Ujjain ఆలయంలో ఘోరం.. పిడుగుపాటుతో ముగ్గురు మృతి.. ఎగిరిపడ్డ సప్త రుషుల విగ్రహాలు..
విగ్రహాలు కుప్పకూలాయి. ఆరు దెబ్బతిన్నాయి. మెడ, చేతులు, విరగడంతో పాటు విగ్రహాలు బొక్కబోర్లా పడ్డాయి. ఇక వర్షం ధాటికి చెట్లకు కిందకు చేరిన ప్రజలపై పిడుగు పడింది. దీని ధాటికి ముగ్గురు ప్రాణాలు వదిలారు.
దేశంలోని జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటైన ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో (Mahakaleshwar Jyotirlinga Temple) గాలివాన బీభత్సం సృష్టించింది. ఈ గాలివానకు కొత్తగా నిర్మించిన సప్తరుషుల విగ్రహాలు కుప్పకూలాయి. ప్రధాని మోదీ (Mod) ప్రారంభించి ఏడాది కూడా కాకముందే మహాకాల్ కారిడార్ (Mahakal Lok Corridor)లో నాణ్యత లోపం కనిపించింది. దీనిపై సర్వత్రా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పవిత్రమైన ఆలయంలో నాసిరకం నిర్మాణాలతో పెద్ద అవినీతికి పాల్పడ్డారని బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.
మధ్యప్రదేశ్ (Madhya Pradesh) లోని ఉజ్జయిని జిల్లాలో (Ujjain District) ఉన్న ప్రముఖ శైవ క్షేత్రం మహాకాళేశ్వర ఆలయం. ఆదివారం ఉజ్జయినిలో ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఈ వర్షం బీభత్సం సృష్టించింది. పిడుగు పడి ముగ్గురు మరణించారు. ఇక కారిడార్ లో ఏర్పాటు చేసిన 155 విగ్రహాలలో (Statues) ఉన్న సప్త రుషుల (Saptarishi Idols) విగ్రహాలు కుప్పకూలాయి. ఆరు దెబ్బతిన్నాయి. మెడ, చేతులు, విరగడంతో పాటు విగ్రహాలు బొక్కబోర్లా పడ్డాయి. ఇక వర్షం ధాటికి చెట్లకు కిందకు చేరిన ప్రజలపై పిడుగు పడింది. దీని ధాటికి ముగ్గురు ప్రాణాలు వదిలారు.
మహాకాల్ లోక్ కారిడార్ పేరిట సుమారు 900 మీటర్ల పొడవుతో రూ.850 కోట్లతో నిర్మించారు. దీనిలో మొదటి దశను (First Phase) ప్రధాని మోదీ గతేడాది అక్టోబర్ 11న ప్రారంభించాడు. ఏడాది కూడా కాకముందే ఈ పనుల్లో నాణ్యత డొల్ల అని తేలిపోయిందని కాంగ్రెస్ పార్టీ (Congress Party) విమర్శించింది. అవినీతికి అలవాటుపడిన ప్రభుత్వం దేవుడిని కూడా వదలడం లేదని మధ్యప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు కమల్ నాథ్ (KamalNath) మండిపడ్డారు. కాగా, వెంటనే పునరుద్ధరణ పనులు చేయాలని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అధికారులకు ఆదేశించారు.
BJP's corruption has not spared even our most pious corridor! The Ujjain Corridor sanctioned by Kamal Nath govt but taken over by the BJP after they toppled the Cong govt & completed at a cost of ₹856 cr & inaugurated by our PM, has fallen apart after one strong wind & storm. pic.twitter.com/r2vsVFi3gz
— Mute hindu🤐 { Yogi ka parivar } (@Mute_hindu) May 29, 2023
Ujjain, Mahakal Lok. 6 idols of Saptarishi were damaged in a storm. It was inaugurated by the PM in October last year. Around 700 crore rupees were spent on this project. pic.twitter.com/1MRqD03c1X