NTR: నందిగామ మండలం చెరువుకొమ్ము పాలెంలో గురువారం ముత్యాలమ్మ తల్లి ఆలయ శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ దేవతల ఆశీస్సులతో గ్రామాభివృద్ధి, ప్రజల శ్రేయస్సు మరింతగా పెరుగుతుందన్నారు. ప్రజలు ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.