VSP; విశాఖ నగరానికి చెందిన 9వ తరగతి విద్యార్థి పి. చైతన్య కార్తికేయ క్రికెట్లో జాతీయ స్థాయికి ఎంపికై సత్తా చాటాడు. SGFI నిర్వహించే 69వ జాతీయ పాఠశాలల అండర్-17పోటీలకు ఎంపికయ్యాడు. CBSE సౌత్ జోన్-1 జట్టులో చోటు దక్కించుకున్న ఏకైక ఏపీ క్రీడాకారుడు ఇతనే. అక్టోబర్ 2025లో జరిగిన జాతీయ T20 టోర్నీలో సౌత్ జోన్ టైటాన్స్ తరపున ఆడి ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.