MBNR: దేవరకద్ర మార్కెట్ యార్డుకు 505 క్వింటాళ్ల సన్న రకం వరి ధాన్యం విక్రయానికి వచ్చిందని కార్యదర్శి జయలక్ష్మి తెలిపారు. సన్నరకానికి క్వింటాల్‌కు రూ.2,633 ధర పలికింది. అదేవిధంగా 24 క్వింటాళ్ల దొడ్డు రకం ధాన్యాన్ని తీసుకురాగా రూ.1,811 ధర నమోదైంది. గత కొన్ని రోజులుగా మార్కెట్‌కు సన్నరకం ధాన్యం ఎక్కువగా వస్తుందని కార్యదర్శి పేర్కొన్నారు.