అంబేడ్కర్ కోనసీమ జిల్లావ్యాప్తంగా ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 108 కొత్త పోలింగ్ కేంద్రాలను ప్రతిపాదించినట్లు కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. గురువారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శి వివేక్ యాదవ్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు ఆయన హాజరయ్యారు. 1200 ఓటర్లు దాటిన చోట ఈ కొత్త కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ వివరించారు.