SRCL: అభివృద్ధి పనులు జరుగుతున్న వేములవాడ క్షేత్రానికి అదనపు భద్రత కల్పించారు. ఇందుకోసం SPF విభాగం నుంచి అదనంగా 12 మంది సిబ్బందిని కేటాయించారు. ప్రస్తుతం ఒక ASI, ఇద్దరు HCలు, 10 మంది కానిస్టేబుల్స్ భద్రతా విధులు నిర్వర్తిస్తున్నారు. భీమేశ్వరాలయంలో దర్శనాలు ప్రారంభం కావడం, భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో అదనపు భద్రత కల్పిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.