SGR: జిల్లాలోని పటాన్చెరు మండలంలో మూడు గ్రామాల్లోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మండలంలో భానూర, నందిగామ, క్యాసారం గ్రామాలు మాత్రమే ఉన్నాయి. మండలంలో గతంలో 28 గ్రామాలు ఉండగా అమీన్పూర్ మండలంగా, ఇస్నాపూర్, ఇంద్రేశం మున్సిపాలిటీలుగా ఏర్పడటంతో ఈ మూడు గ్రామాలే మిగిలాయి. దీంతో జిల్లాలోనే అతి చిన్న మండలంగా పటాన్చెరు మిగిలిపోయింది.