W.G: శతాబ్దాల చరిత్ర కలిగిన కాళ్లకూరు స్వయంభూ శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానానికి ప్రభుత్వం నూతన ధర్మకర్తల మండలిని నియమించింది. ఛైర్మన్ మాజీ సర్పంచ్ అడ్డాల శివరామరాజు (రాము) సహా మరో పది మంది సభ్యులను ఎంపిక చేసింది. తమకు ఈ అవకాశం కల్పించిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు కృతజ్ఞతలు తెలిపిన నూతన కార్యవర్గం, ఆలయ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తామన్నారు.