VSP: సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని రాష్ట్ర అంచనాల కమిటీ (PUC) బుధవారం పరిశీలించింది. కమిటీ ఛైర్మన్ మండపేట ఎమ్మెల్యే వి.జోగేశ్వరరావు, సభ్యుల బృందం ఆలయ ప్రాంగణాన్ని సందర్శించి భక్తులకు ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. ఇ.ఓ సుజాత, దేవస్థానం అధికారులతో సమావేశమై 2019-22 ఆర్థిక అంచనాలు, అభివృద్ధి పనుల పురోగతి, యాత్రికుల సేవలపై సమీక్షించారు.