NLG: మిర్యాలగూడ పట్టణంలో కొలువై ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్పస్వామి మండల పూజ కార్యక్రమం కేరళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డిని ఆలయ చైర్మన్ ముక్కుపాటి వెంకటేశ్వరరావు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు భక్తులు పాల్గొన్నారు.