ATP: పెనుకొండ నియోజకవర్గం నుంచి 50 మంది నాయకులు బుధవారం జనసేన పార్టీలో చేరారు. అనంతపురం సప్తగిరి సర్కిల్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు టీసీ. వరుణ్ వీమారిని పార్టీలోకి ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ ఆశయాలు, కూటమి ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వరుణ్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. పార్టీలో ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.