NLR: సంగం పట్టణంలోని జాతీయ రహదారిపై బుధవారం ఎస్సై రాజేష్ వాహనాలను తనిఖీ చేపట్టారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. రోడ్డు నియమ నిబంధనలు ప్రతి ఒక్కరు పాటించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీసులు తదితరులు పాల్గొన్నారు.