ప్రకాశం: హనుమంతునిపాడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట కార్మికులు బుధవారం ధర్నా చేపట్టారు. కార్మికుల చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులను కాలరాసేందుకు కేంద్రం లేబర్ కోడ్స్ తీసుకువచ్చిందని కార్మికులు విమర్శించారు.