MHBD: తొర్రూరు మండలంలోని చర్లపాలెం గ్రామంలో హనుమాండ్ల మాధవ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యాదవ సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఇవాళ ట్రస్ట్ ఛైర్మన్, తొర్రూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ హనుమాండ్ల తిరుపతి రెడ్డి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. వారి వెంట కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, సీనియర్ నాయకులు తదితరులు ఉన్నారు.