W.G: అత్తిలి శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి కల్యాణ మహోత్సవాల సందర్భంగా తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ దంపతులు బుధవారం ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, వారికి స్వామివారి ఆశీస్సులు అందించారు. అనంతరం ఆలయ కమిటీ తరఫున ఎమ్మెల్యే దంపతులను సత్కరించారు.