నందమూరి బాలకృష్ణతో గోపీచంద్ మలినేని ‘NBK-111’ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాలో బాలయ్య డ్యూయెల్ రోల్లో కనిపించనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేయగా ఆకట్టుకుంటోంది. ఇందులో రెండు కోటలపై బాలయ్య యోధుడి పాత్రలో ఒక లుక్లో, మెడలో రుద్రాక్షమాలతో మరో లుక్లో కనిపిస్తున్నారు. ఇక ఈ మూవీలో నయనతార కథానాయికగా నటిస్తుండగా.. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.