KDP: జిల్లాలోని ఒంటిమిట్ట,సిద్ధవటం మండలాలను రాజంపేట రెవెన్యూ డివిజన్లోకి చేరుస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో రాజంపేట నియోజకవర్గంలోని మండలాలన్నీ ఓకే డివిజన్లోకి చేరనున్నాయి. ఈ నిర్ణయానికి మంత్రివర్గం ఇవాళ ఆమోదం తెలపనుంది. ఆ వెంటనే ప్రాథమిక డిజిట్ నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. తర్వాత నెల రోజులు పాటు అభ్యంతరాలను స్వీకరిస్తారు.