SKLM: భారత దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజపేయి విగ్రహాన్ని ఎచ్చెర్ల మండలంలోని కుశాలపురం బైపాస్ వద్ద ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే నిన్న స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే ఈశ్వరరావు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పైడి వేణుగోపాలం పరిశీలించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్. మాధవ్ ఆదేశాల మేరకు విగ్రహాం ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.