ATP: ఎమ్మెల్యే సురేంద్ర బాబు చొరవతో చెర్లోపల్లి గేటు నుంచి కైరేవు గ్రామం వరకు 1.5 కిలోమీటర్ల బీటీ రోడ్డు పనులు పూర్తి కాబోతున్నాయి. త్వరలో కైరేవు నుంచి శెట్టూర్ వరకు 6 కి.మీ రోడ్డు పనులు కూడా ప్రారంభిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.