HYD: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆసెంబ్లీలోని తన ఛాంబర్లో నవీన్ యాదవ్‌తో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్, Dy. CM భట్టి విక్రమార్క, రాష్ట్ర AICC ఇంఛార్జ్ మీనాక్షి, TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు హాజరుకానున్నారు.