హన్మకొండ జిల్లాలోని 12 మండలాల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు 3 విడతల్లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని కలెక్టర్ స్నేహా శబరీష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎలాంటి వివాదాలు, తప్పిదాలకు అవకాశమే లేకుండా విధులను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు.