KDP: ఖాజీపేట సీఐ వంశీధర్ ఆధ్వర్యంలో మంగళవారం పోలీసులు ‘మహిళా భద్రత’పై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలు ఆపద సమయాల్లో తక్షణ సహాయం పొందేందుకు వీలుగా, అత్యవసర టోల్ ఫ్రీ నెంబర్లను ముద్రించిన పోస్టర్లను ఆటోలకు ఏర్పాటు చేశారు. డయల్ 112, 1098, 181, 1091, 1930 వంటి హెల్ప్‌లైన్ నెంబర్లను వినియోగించుకోవాలని గ్రామాల్లోని మహిళలకు సూచిస్తున్నారు.