ATP: యాటకల్లుకు చెందిన రైతు శివన్న తోటలో ఎలుగుబంట్లు 5 ఎకరాల పొలంలో బొప్పాయి సాగు చేశానని, పంట చేతికొచ్చాక రోజూ ఎలుగుబంట్లు దాడి చేసి నష్టపరుస్తున్నాయని బాధిత రైతు ఆవేదన చెందుతున్నాడు. రాత్రి సమయాల్లో కాపలా ఉన్నా.. నిద్ర పోయాక ఎలుగుబంట్లు దాడి చేస్తున్నాయన్నాడు. తోటల్లో పైపులైన్లు, డ్రిప్ పరికరాలను ఎలుగుబంట్లు ధ్వంసం చేసినట్లు రైతులు చెబుతున్నారు.