ఢిల్లీలో కాలుష్య తీవ్రత దృష్ట్యా ఏకంగా ప్రధానమంత్రి కార్యాలయం రంగంలోకి దిగింది. నగరంలో కాలుష్యానికి కారణమయ్యే వాహనాలపై చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను ఆదేశించింది. ఇదే సమయంలో విద్యుత్ వాహనాలను విస్తృతపరిచే చర్యలు ముమ్మరం చేయాలని సూచించినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి సబ్సిడీలతో పాటు ఛార్జింగ్ స్టేషన్లకు మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించింది.