NZB: కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ పట్టణంలోని రోటరీ భవన్ కాన్ఫరెన్స్ హాల్లో మహిళలకు వడ్డీలేని రుణాల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సెగ్మెంట్ పరిధిలోని 3,703 మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాల రూపేణ ప్రభుత్వం రూ. 4.28 కోట్ల నిధులను వారి ఖాతాల్లో జమ చేసిందని పేర్కొన్నారు.