MHBD: డోర్నకల్ మండల కేంద్రంలోని చింతపల్లి, కందికొండ గ్రామాల్లో కాంపెల్లి సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వ చీఫ్ విప్, MLA డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్ ఇవాళ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఇబ్బందులు లేకుండా నిబంధనలతో కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. తూకం, బస్తాలు, గోడౌన్ సౌకర్యాలు కల్పించాలని సూచించారు.