Raavi Narayana Reddy: కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం జరిగింది. దానికి సంబంధించిన విశేషాలు మనం చూస్తూనే ఉన్నాం. మరీ పాత పార్లమెంట్ నిర్మాణం.. అందులో అడుగిడిన తొలి ఎంపీ ఎవరో తెలుసా..? మన తెలుగు బిడ్డ.. తెలంగాణ ముద్దుబిడ్డ రావి నారాయణ రెడ్డి (Raavi Narayana Reddy). దేశ తొలి ప్రధాని నెహ్రూ (nehru) కాక రావి నారాయణ రెడ్డి (Raavi Narayana Reddy) ఎందుకు పాదం మోపారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1951-52లో తొలి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అప్పుడు నెహ్రూ (nehru) నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఉత్తరప్రదేశ్ జౌన్ పూర్ నుంచి నెహ్రూ పోటీ చేసి విక్టరీ కొట్టారు. కేఎంపీపీ అభ్యర్థి బస్సీలాల్పై లక్ష 73 వేల 929 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అయితే నెహ్రూ కన్నా ఎక్కువ మెజార్టీతో రావి నారాయణ రెడ్డి (Raavi Narayana Reddy) గెలుపొందారు.
తెలంగాణ సాయుధ పోరాటంలో రావి నారాయణ రెడ్డి (Raavi Narayana Reddy) చురుగ్గా పాల్గొన్నారు. తొలి ఎన్నికల్లో నల్గొండ నుంచి పీడీఎఫ్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. కాంగ్రెస్ నుంచి భాస్కరరావు పోటీలో ఉన్నారు. ఆయనపై 2 లక్షల 22 వేల 280 ఓట్ల తేడాతో బంఫర్ విక్టరీ కొట్టారు. తన కన్నా ఎక్కువ మెజార్టీ వచ్చిన రావి నారాయణ రెడ్డిని (Raavi Narayana Reddy) పార్లమెంట్లో పాదం మోపాలని నెహ్రూ (nehru) కోరారట.. ఆయన కాదనలేక అడుగుపెట్టారు. ఆ ఘనత సాధించిన తెలంగాణ బిడ్డగా రికార్డులకు ఎక్కారు.