ఉల్లి ధరలు భారీగా తగ్గడంపై రైతులు వినూత్నంగా నిరసన చేపట్టారు. మధ్యప్రదేశ్లోని మాండ్సౌర్ జిల్లాలోని ధన్నూర్లో ఉల్లిగడ్డలను పాడపై పేర్చి అంత్యక్రియలు చేశారు. పంట పెట్టుబడికి ఎక్కువ మొత్తంలో ఖర్చుచేస్తుండగా.. కనీసం గిట్టుబాటు ధర రాకపోవడంతో నష్టాలపాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.