PLD: పెదకూరపాడులోని స్థానిక పాలకేంద్రం సమీపంలో ఏర్పాటు చేస్తున్న ప్రైవేట్ సెల్ టవర్‌కు నిరసనగా ప్రజలు తహశీల్దార్ ధనలక్ష్మికి మంగళవారం వినతి పత్రం అందించారు. జనావాసాల వద్ద సెల్ టవర్ ఏర్పాటు చేయవద్దని వారు కోరారు. సమీపంలో ప్రాథమిక పాఠశాల, చర్చిలు, ప్రజల నివాసాలు ఉన్నందున రేడియేషన్ ప్రమాదం ఉంటుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.