TG: GHMC చివరి జనరల్ బాడీ సమావేశానికి ముందు బీజేపీ వినూత్న నిరసన చేపట్టింది. BJP కార్పొరేటర్లు GHMC కార్యాలయానికి దున్నపోతును తీసుకుని వచ్చారు. సమస్యలు పరిష్కరించడం లేదని దున్నపోతుకు వినతిపత్రం ఇచ్చారు. మేయర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కౌన్సిల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలంటూ ఆందోళన చేపట్టారు. మరో రెండు నెలల్లో పాలకపక్షం ముగియనున్న విషయం తెలిసిందే.