AP: రాష్ట్రంలో విద్యుత్ వాహనాలను ప్రోత్సహించడంలో భాగంగా ఛార్జింగ్ నెట్వర్క్, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద విద్యుత్ బైక్లు, కార్లు, ఆటోలు, బస్సుల కోసం 4,018 ఛార్జింగ్ కేంద్రాలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రూ.385.57 కోట్లతో ప్రాజెక్టును రూపొందించింది. ఈ మేరకు కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపింది.