KMM: నేలకొండపల్లి, ముజ్జుగూడెం సుర్దేపల్లి రైతు వేదికల్లో నేడు ఉదయం 10 గంటలకు ‘రైతు నేస్తం’ కార్యక్రమం నిర్వహిస్తామని ఏవో ఎం. రాధా తెలిపారు. రైతులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని, ప్రభుత్వ విధానాలపై అవగాహన పెంచుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా నూతన విత్తన చట్టంపై రైతులకు పూర్తి అవగాహన కల్పిస్తామని చెప్పారు.