KNR: కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రెజెంటేటివ్స్ యూనియన్ (TMSRU) KNR శాఖ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు చీకోటి శ్రీధర్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు యూ. శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.