CTR: కుప్పం మున్సిపాలిటీ పరిధిలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఆధార్ క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 21వ వార్డు మురుగన్ టాకీస్ రోడ్డు అంగన్వాడీ కేంద్రంలో, 12వ వార్డు షికార్ కాలనీ పాఠశాల ఆవరణంలో ప్రత్యేక ఆధార్ క్యాంపు అందుబాటులో ఉందన్నారు.ఈ నెల 26వ తేదీ వరకు ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చన్నారు.