ప్రకాశం జిల్లా వ్యాప్తంగా సోమవారం పోలీసులు వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. కూలీలను పరిమితికి మించి వాహనాలలో ఎక్కించుకొని వెళ్తున్న వారిని గుర్తించి, నిబంధనలు పాటించాలని, ప్రమాదాలు జరిగితే ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. అధికారులు వాహన డ్రైవర్లకు మందలించి, ప్రమాదాల నివారణకు సహకరించాలని సూచించారు.